హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నారని, వార్షిక ఆస్తి వివరాల నివేదికను సమర్పించలేదన్న ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయనపై శాఖపరమైన విచారణ జరపాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. విచారణాధికారిగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను నియమించింది. మూడు నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.