నాలుగున్నరేండ్లకే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలి
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాలుగున్నరేండ్లకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని కాళోజీ హెల్త్ వర్సిటీ మరోసారి స్పష్టంచేసింది. వర్సిటీ రిజిస్ట్రార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ట్యూషన్ ఫీజుల పేరిట కాలేజీలు విద్యార్థులను వేధించవద్దని సూచించింది.
- ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కాళోజీ వర్సిటీ ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాలుగున్నరేండ్లకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని కాళోజీ హెల్త్ వర్సిటీ మరోసారి స్పష్టంచేసింది. వర్సిటీ రిజిస్ట్రార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ట్యూషన్ ఫీజుల పేరిట కాలేజీలు విద్యార్థులను వేధించవద్దని సూచించింది. టీఏఎఫ్ఆర్సీ రూల్స్ ప్రకారం నాలుగున్నరేండ్లకే ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా.. ఐదో ఏడాది ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని కాళోజీ వర్సిటీ వీసీకి పలువురు ఫిర్యాదు చేశారు.
మెడికల్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు రోటరీ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. చాలా కాలేజీలు ఈ ఇంటర్న్‌షిప్ కాలానికి కూడా అదనంగా ఫీజు కట్టాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనిపై సీరియస్ అయిన వర్సిటీ కేవలం నాలుగున్నరేండ్ల కాలానికి మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

