సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 5: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా వాణిజ్య పన్నులశాఖ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శాఖ అధ్యక్షుడిగా ఎం భరత్‌భూషణ్, కార్యదర్శిగా జీ సుదర్శన్‌గౌడ్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఏ ఆనంద్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం మల్లేశ్, ఎంఏ ఖయ్యూం, భానుచందర్, కే సుజాతరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ భవాని, ఏ సంతోష్‌కుమార్, ఎండీ షరీఫ్, ఎస్ ఈశ్వరి, కోశాధికారిగా కే సందీప్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా డీకే నరేందర్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా ఈస్తం షాముల్ హక్, క్రీడా కార్యదర్శిగా బాలాజీ, కార్యవర్గ సభ్యులుగా ఎస్ యాస్మిన్ భాను, పీ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ నూతన యూనిట్ సభ్యులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు.