మహబూబ్ నగర్ : జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వార్డు మెంబర్లు ( Wardmembers ) కాంగ్రెస్ ( Congress ) ను వీడి బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) గారి సమక్షంలో గులాబీ కండువాలను కప్పుకున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోహెబ్ ఉరహమాన్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వలియొద్దీన్ ,వెంకటన్న , ఇటీవల కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డ్ మెంబర్లు అలివేలు రాములు, శారద కురుమూర్తి, పారిజాత నాగరాజు, మహేందర్, గోవర్ధన్ త పాటు మరో వంద మంది బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్త అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమాను వ్యక్తం చేశారు.