రాహుల్‌గాంధీ చేసిన ఏ వ్యాఖ్యలకు అనర్హత వేటు పడింది? కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఏవేవి? లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులెందరు? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు, ఓటింగ్ శాతం ఎంత? ఈ మధ్య ఉద్యోగ నియామకాల్లో రాజకీయపార్టీల గురించి కూడా అడుగుతున్నారా? అని ఆశ్చర్యపడుతున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధులుగా 12 మంది జాబితాను ఆమోదానికి అధిష్ఠానానికి పంపించింది. అధికార ప్రతినిధులుగా గతంలో మాదిరిగా ఎవరినంటే వారిని నియమించేది లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పష్టం చేశారు. ఇందుకుగాను త్వరలో హైదరాబాద్‌కు వచ్చి అభ్యర్థులకు ఇంటర్వ్యులు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. దీంతో అధికార ప్రతినిధి పదవి ఆశిస్తున్న నేతలు తమను ఇంటర్వ్యూలో ఏమడుగుతారని సీనియర్లను ఆరా తీస్తున్నారు. మునుపెన్నడూ ఇంటర్వ్యులు జరిగిన దాఖలాల్లేవు. ఎందుకైనా మంచిది పార్టీ జీకే తెలిసి ఉంటే మంచిదని సీనియర్లు సెలవి చ్చారట. – వెల్జాల