కొల్లామ్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం కొల్లామ్‌లో మత్స్యకారులతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అయన.. రైతులు భూమిని సేద్యం చేస్తున్నట్లుగానే, మత్స్యకారులు సముద్రాన్ని సేద్యం చేస్తున్నారని పేర్కొన్నారు. భూమిని సాగు చేసుకునే రైతులకు కేంద్రంలో ప్రత్యేక శాఖ ఉన్నదని, మత్స్యకారులకు కూడా ప్రత్యేక శాఖ ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు అంటే ఈ తెల్లవారుజామున మత్స్యకారులతో కలిసి రాహుల్‌గాంధీ సరదాగా చేపలవేటకు వెళ్లారు.
#WATCH | Just like farmers farm the land, you farm the sea. Farmers have a Ministry in Delhi, you don't… First thing I'd do is have a Ministry dedicated to fishermen of India so that your issues can be defended & protected: Congress leader Rahul Gandhi in Kerala's Kollam pic.twitter.com/RYcLCbDiQx
— ANI (@ANI) February 24, 2021