కల్వకుర్తి, నవంబర్ 19 : ‘ప్రభుత్వం ఫీల్ అయినా.. కాంగ్రెస్ నాయకులు బాధపడినా సరే.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు సరిగ్గా లేవు.. వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
టెక్నాలజీ పెరిగింది.. ప్రభుత్వాలు రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి.. అయినా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదం లో సరైన వైద్యం అందక తీవ్ర రక్తస్రావమై నిండు ప్రాణం బలైపోయిందంటూ ఆవేదన చెందారు. కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.