హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మద్యం పాలసీ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం బుధవారం అనుమ తి ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం కమీషన్ల ద్వారా రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్టు తేల్చింది. తిరుపతితోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తుల జప్తునకు ఆదేశించింది. సిట్ విజ్ఞప్తిమేరకు ఏపీ ప్రభుత్వం ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.