నాకు ఎలాంటి నోటీసులు అందలేదు
నిధుల కోసం తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు.
- క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ చెప్పలేదు
- జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, అక్టోబర్ 30 : నిధుల కోసం తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు
అందలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా
జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. నిధుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకుగాను పీసీసీ
అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారని విలేకరులు ప్రశ్నించగా..
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పలేదని అన్నారు.
‘మంత్రులకే నిధులా? ఎమ్మెల్యేలకు నిధులు లేవా? అని ప్రభుత్వాన్ని అడిగాం.. నియోజకవర్గాలలో అభివృద్ధి జరుగాలంటే నిధులు ఇవ్వాలి.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని కోరాం.. అందులో తప్పేముంది?’ అని అన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలేదని మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా అన్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నట్టు తాను విన్నానని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ తనను అడిగితే వివరణ ఇస్తానని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. నిధుల కోసం తాను కొట్లాడుతానని స్పష్టంచేశారు. అది తమ అంతర్గత విషయమని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

