తొందరలోనే సర్కార్‌కు హాలిడే
రైతులు పంటలు వేయవద్దని క్రాప్ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు హాలిడే ప్రకటించే రోజులు దగ్గర పడ్డాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
- నీళ్లను దిగువకు వదిలి తీరని ద్రోహం
- బుద్ధిచెప్పేందుకు ఎదురుచూస్తున్నరైతాంగం:ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రైతులు పంటలు వేయవద్దని క్రాప్ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు హాలిడే ప్రకటించే రోజులు దగ్గర పడ్డాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ నీళ్లు ఎత్తడం చేతగాని కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ కరువును తెచ్చిందని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యలతో వెయ్యి టీఎంసీల నీళ్లు గంగపాలయ్యాయని నిప్పులు చెరిగారు. ఇది ఎల్‌నినో ప్రభావం కాదు..ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభావమేనని దెప్పి పొడిచారు. కేటీఆర్ నేతృత్వంలో గత జూన్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ వద్దకు వెళ్లి ప్రభుత్వం కండ్లు తెరిపించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు.
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 25 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయని, కానీ సోయిలేని సీఎం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘క్రాఫ్హాలిడే ప్రకటించేందుకు రేవంత్‌రెడ్డి ఎవరు? తెలంగాణ ఏమైనా నీ జాగీరా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఏనాడు కరువుకోరల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువుతో ప్రజలు అల్లాడి పోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో కారు కడిగినందుకు ఫైన్ వేశారని.. మరీ మేడిగడ్డ నుంచి నీళ్లెత్తని రేవంత్‌రెడ్డికి ఎంత ఫైన్ వేయాలని ప్రశ్నించారు. కరువు కారణంగా ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువును తెచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు రైతాంగం సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.
నీళ్ల సమ్మిట్ పెట్టండి: ఎమ్మెల్యే సంజయ్కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరిట డ్రామాలడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిప్పులు చెరిగారు. ‘ఆయన పెట్టాల్సింది గ్లోబల్ సమ్మిట్ కాదని..నీళ్ల సమ్మిట్ పెడితే నీళ్లు ఎలా ఎత్తిపోయవచ్చో చూపిస్తాం..’అంటూ ఎద్దేవాచేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశాన్ని శాసించిందని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి యాచించే దుస్థితి వచ్చిందని విమర్శించారు. ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నదని దుయ్యబట్టారు. మోదీని పెద్దన్న అని సంబోధించే రేవంత్ పరిశ్రమలు ఎందుకు తేవడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ మూడేండ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదని దెప్పిపొడిచారు. కేసీఆర్ పాలనలో 30 ఫ్లైఓవర్లు.. అద్భుతమైన భవనాలు, సకల హంగులతో సెక్రటేరియట్ రూపుదిద్దుకున్నదని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

