MLA Kranthi Kiran | ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
MLA Kranthi Kiran | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు.
సంగారెడ్డి : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు.
పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెప్ పార్టీ నాయకులు మాయమాటలతో ఓట్ల కోసం వస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్లీ కాగ్రెస్ పార్టీకి ఓటెస్తే కరెంట్ కోతలతో రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

