మద్దూర్ (కొత్తపల్లి ) : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ( Congress ) పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలో బీఆర్ఎస్( BRS ) లో చేరారు.
గ్రామ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు లక్ష్మి, మంగమ్మ, బాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ శ్రీనివాస్ రెడ్డి, పటేల్ నరేందర్ రెడ్డి, రాములు, కొత్తపల్లి మండలం ముదిరాజ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మొగులయ్య, హనుమంతు, దస్తప్ప, రాజ్ కుమార్ రెడ్డితోపాటు 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
శనివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ పార్టీలో చేరిన వారిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎస్సార్ రెడ్డి, బీఆర్ఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.