కామారెడ్డి, జూన్ 13: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్చంద్రకు శనివారం వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, కొన్ని మీడియా చానళ్లలో ప్రసారం అవుతున్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని డిమాండ్ చేశారు.