నల్లబెల్లి, నవంబర్ 28: కాంగ్రెస్ నాయకుడి మోసంతో బాధిత దివ్యాంగులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లికి చెందిన గొర్రెల కాపరి నానెబోయిన కుమారస్వామి 2020లో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. భార్య రాజమ్మ, కుమారుడు రాజు దివ్యాంగు లు కావడంతో గొర్రెలను కాసే పరిస్థితి లేక తమ 100 గొర్రెలను విక్రయించగా రూ. 6 లక్షలు వచ్చాయి. ఇదే గ్రామానికి చెంది న కాంగ్రెస్ నాయకుడు బత్తిని మహేశ్ తన 38 గుంటల భూమిని అమ్ముతానని తెలపడంతో, ఆ భూమి కొనుక్కొని దానిపై ఆధారపడి జీవిస్తామనే యోచనతో తమ దగ్గర ఉన్న రూ. 6 లక్షలకు తోడు మరో రూ. 4 లక్షలు అప్పుచేసి కొనుగోలు చేశారు.
రూ. 10 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ కాగితం లో తప్పుడు సర్వే నంబర్ వేయడంతోపాటు నాలుగేండ్లుగా భూమిని రిజిష్ట్రేషన్ చేయకుండా వేధించాడు. దీంతో బాధితు లు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌తో పాటు నర్సంపేట ఏసీపీ, సీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సైతం గోడు వెల్లబోసుకున్నారు. రెం డు నెలలైనా న్యాయం చేయకపోవడంతో తమకు చావే శరణ్యమని గ్రామపంచాయతీ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారించడంతో బాధితులు రాజు, అతడి తల్లి రా జమ్మ ఆందోళనను విరమించుకున్నారు. తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా బాధితుల ఫిర్యా దు రికార్డులో నోట్ చేసుకున్నామని చె ప్పారు. ఈ భూమిని ఇతరులకు రిజిష్ర్టేష న్ చేయబోమని, బాధితులు కోర్టును ఆశ్రయిస్తే వారి ఆదేశాల మేరకు భూమిని హోల్డ్‌లో పెట్టడానికి కలెక్టర్‌కు అథారిటీ ఉంటుందని తెలిపారు.