హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత వైద్యంతో ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. కోకాపేటలోని ఆ యన స్వగృహంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులు, సిబ్బంది ఆదివారం కలిసి తమ గోడు చె ప్పుకొన్నారు.
జీతాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తమ దీనస్థితిని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన దవాఖానలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.