నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ ( Nalgonda ) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీ ముసుగులో ప్రైవేటికరణ చేసి బడా బాబులకు అప్పచెప్పాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటికరణ చేయడం అంటే నిరుపేద విద్యార్థులకు వృత్తివిద్యను దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కాడింగు శ్రీకాంత్ గౌడ్, బకరం నరేందర్, రమేష్, వెంకటేష్, ఆంజనేయులు, రాజు కుమార్, శివ, మురళి, సురేష్, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.