బెంగళూరులో రూ.19.5 కోట్లతో నిర్మించిన కుందనహళ్లి అండర్పాస్ రోడ్డు ప్రారంభించిన నాలుగు నెలలకే కుంగిపోయింది. తూర్పు శివారు ప్రాంతాన్ని మిగతా ఐటీహబ్తో కలిపే ఈ రోడ్డు కుంగిపోవడానికి నాసిరకం పనులే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టర్ల నుంచి కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్ తీసుకోవడంతోనే ఇలాంటి దుస్థితి వచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి.