నేరడి గొండ / ఇచ్చోడ : ఎన్నికల్లో మోసపూరిత హామీలతో ఆటో డ్రైవర్లను( Auto Drivers ) కాంగ్రెస్ మోసం చేసిందని జాదవ్ అనిల్ (MLA Jadhav Anil ) విమర్శించారు. ఈనెల 27న హైదరాబాదులోని ఇందిరా పార్క్లో జరుగనున్న ఆటో ఆకలికేకలు మహా సభ పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టం తప్ప పూట గడవని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ఓట్లు దండుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఇచ్చోడ : మండలంలో ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తక్షణమే తొలగించి తాత్కాలిక మొరం రోడ్డును పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పలు కాలనీలకు వెళ్లే దారుల వద్ద నిల్వ ఉన్న నీటిని పరిశీలించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న నీటిని తక్షణమే తొలగించాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ముండే పాండురంగ్, మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సాబీర్, రమేష్, మహేందర్ రెడ్డి, గణేష్ ఉన్నారు.