హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శా తం రిజర్వేషన్లపై తేల్చకుండా గ్రామ పంచాయతీ ఎ న్నికలకు వెళ్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించడం మరోసారి బీసీలను మోసం చేయడమేనని బీసీ రిజర్వేష న్ల సాధన సమితి అధ్యక్షుడు టీ చిరంజీవులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి భేటీకి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపేలా చూడటంతో పా టు, 9వ షెడ్యూల్లో చేర్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
జల్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): జల్ సంచాయ్ జ న్ భాగీదారీ విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలవగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ డాక్టర్ సృజన అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జల్ శక్తిశాఖమంత్రి సీఆర్ పాటిల్ చేతులమీదుగా జాతీయ జల్ అవార్డులను జిల్లాల అధికారు లు స్వీకరించారు. 6వ జాతీయ జల్ సంచాయ్ జన్ భాగీదారీ విభాగంలో క్యాటగిరీ-1లో దక్షిణ జోన్ కింద ఆదిలాబాద్, నల్లగొండ, మం చిర్యాల జిల్లాలు వరుసగా 3 ర్యాం కులు సాధించాయి. ఒకో జి ల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు పురస్కారం అందుకున్నాయి. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో జీహెచ్ఎంసీ రెండో ర్యాంకు సాధించింది. ఈ విభాగంలో క్యాటగిరీ-2లో వరంగల్, నిర్మల్, జనగామ, జిల్లాలు దక్షిణ జోన్లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బ హుమతి గెలుచుకున్నాయి. క్యాటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం 1వ ర్యాం కు, మహబూబ్‌నగర్ 3వ ర్యాంకులో నిలిచి.. రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి.