Gandhi Bhavan | రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ గాంధీ భవన్‌ను ముట్టడించడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు.దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ దాడిలో ఓ రిపోర్టర్ తలకు గాయమవడంతో హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహేష్ గౌడ్, మంత్రులు, పొంగులేటి దామోదరను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కాంగ్రెస్ నిరసనకు పోటీగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
గాంధీ భవన్ వద్ద కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
దాడిలో ఓ రిపోర్టర్ తలకు గాయం pic.twitter.com/nGT3DTQ73x
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026