Rajamouli | ఇంటర్‌లోనే రాజమౌళి తొలి ప్రేమ.. పాత లవ్ స్టోరీని గుర్తుచేసుకున్న జక్కన్న!
Rajamouli | భారతీయ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఆయన, ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్‌గా ఉన్నత శిఖరాలకి ఎదిగిన రాజమౌళి కూడా ఒకప్పుడు సాధారణ విద్యార్థే.
Rajamouli | భారతీయ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఆయన, ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్‌గా ఉన్నత శిఖరాలకి ఎదిగిన రాజమౌళి కూడా ఒకప్పుడు సాధారణ విద్యార్థే. అయితే ఆయన గతంలో చెప్పిన తన తొలి ప్రేమ జ్ఞాపకాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక పాత ఇంటర్వ్యూలో రాజమౌళి తన ఇంటర్ రోజుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తన క్లాస్‌లో ఉన్న ఓ అమ్మాయిని ఎంతో ఇష్టపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆమెపై ఉన్న అభిమానాన్ని లేదా ప్రేమను నేరుగా చెప్పే ధైర్యం మాత్రం తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు.రాజమౌళి మాటల్లోనే చెప్పాలంటే… తనకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని క్లాస్‌లోని దాదాపు అందరికీ తెలుసని, స్నేహితులు కూడా ఆ విషయంపై తనను ఆటపట్టించేవారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ ఏడాది మొత్తం గడిచిపోయే వరకు ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదని తెలిపారు.చివరికి విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఒక్కసారి ధైర్యం చేసి ఆమెతో మాట్లాడానని చెప్పారు. తన ముందు కూర్చున్న ఆ అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తూ “ట్యూషన్ ఫీజు కట్టావా?” అని మాత్రమే అడిగానని తెలిపారు.
ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన వైపు చూసిన ఆ క్షణం ఇప్పటికీ తన మదిలో నిలిచిపోయిందని, ఆ ఒక్క చూపు కోసం చాలా రోజులుగా ఎదురుచూశానని రాజమౌళి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.ఆ సంఘటన జరిగినప్పుడు రాజమౌళి ఏలూరులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారని తెలుస్తోంది. అనంతరం కొంతకాలం చదువుకు విరామం ఇచ్చిన ఆయన, తర్వాత ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టి రచయితగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.సినీ పరిశ్రమలో స్థిరపడిన తర్వాత తమ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రమ ఆయన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరమైన ప్రయాణంలోనూ ఎంతో సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- inter student
- love
- Rajamouli
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

