Jammu and Kashmir | ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి.. మరొకరికి గాయాలు.. కొనసాగుతున్న వేట
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-కోకెర్నాగ్ రోడ్డు మార్గంలో జరిగింది.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-కోకెర్నాగ్ రోడ్డు మార్గంలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)కు చెందిన ఇద్దరు జవాన్లు బుధవారం ఉదయం అనంత్‌నాగ్-కోకెర్నాగ్ రోడ్డులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన తీవ్రవాదులు ఈ జవాన్లపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన ఇతర భద్రతా సిబ్బంది వెంటనే వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ఇద్దరిలో తీవ్ర గాయాల కారణంగా ఒక జవాన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన జవాన్‌ను ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. మరో జవాన్ ఆరోగ్య పరిస్తితిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి అతడికి చికిత్స కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా గాలింపు, తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా పట్టుకోవాలని, పారిపోకుండా చూడాలని గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్ ప్రమాదవశాత్తు ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడి మరణించాడు. మృతుడిని సుఖ్‌ప్రీత్ సింగ్ (27)గా గుర్తించారు. అతడు సుందర్బని సెక్టార్‌లోని మహదేవ్ పోస్టు వద్ద ఎత్తైన ప్రదేశంలో డ్యూటీ చేస్తున్నాడు. అయితే, అక్కడ పట్టు కోల్పోయి జారిపోవడం వల్ల కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అతడి మృతదేహాన్ని స్వాగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

