ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు కాంస్యం దక్కింది. ఢాకా వేదికగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ తుది పోరులో భారత త్రయం రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ, అమన్ సైనీ 235-223 తేడాతో నవాజ్ అహ్మద్ రకిబ్, అషికుజ్జామన్, సోహెల్ రానా (బంగ్లాదేశ్) త్రయాన్ని ఓడించి కాంస్యం ఖాతాలో వేసుకుంది. మహిళల కాంపౌండ్లో భారత త్రయం జ్యోతి సురేఖ, ప్రియా గుర్జార్, పర్ణీత్కౌర్ 208-220 తేడాతో కజకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది.