21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిచ్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడారు. 21A ప్యాకేజీలో మోపాల్ మండలంలోని మంచిప్ప నుండి గాడ్కోల్ వరకు ఆయకట్టు స్థిరకరణ కోరకు ప్రభుత్వం చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని గత రెండు సంవత్సరాలుగా ఈ పనులు నిలిపి వేశారఅన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గాడ్కోల్ సెగ్మెంట్లో మోపాల్, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండల పరిధిలో 84,O14 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు BRS ప్రభుత్వం 3.5 టీఎంసీలతో నిర్మించ తలపెట్టిన మంచిప్ప ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి పంటలకు నీళ్లు అందించాలని వారు డిమాండ్ చేశారు.
రూ.3000 కోట్లతో పనులు ప్రారంభించిన ఆనాటి ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు ఖర్చు చేసి పైప్లైన్లను వేశారని, మరో రూ.1500 కోట్ల నిధులు విడుదల చేస్తే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని వారన్నారు. మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల సమస్యలు వస్తున్నాయని ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా నిర్దేశిత ఆయకట్టుకు నీళ్ళు అందించే అవకాశం ఉన్నదని అన్నారు. ముందుగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకుగాను భూసేకరణ చట్టం 2013 ప్రకారం వారికి నివాసాలు, భూములు, అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సహాయ B.దేవస్వామి, అగ్గు చిన్నయ్య, న్యూడెమోక్రసీ డిచ్పల్లి కార్యదర్శి గంగాధర్, బన్సీ, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.