BRS | ధర్మారం: రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ (KCR) దిష్టిబొమ్మను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేయడం అమానుషమని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం అప్రజాస్వామికమని వారు ఈ ఘటనను ఖండించారు. ఈ సంఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ధర్మారం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో ఎస్సై ఎంబడి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు.

Complanit
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మంగళవారం ధర్మారం (Dharmaram) మండల కేంద్రంలో రాస్తారోకో చేసిన మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను ఉద్దేశ్యపూర్వకంగా దహనం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు వల్ల రాజకీయ ఉద్రిక్తతలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారని వారు వెల్లడించారు. వీటితో పాటు ఇతర ఆధారాలు పోలీసుల దర్యాప్తునకు సమర్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు ఎస్సైని కోరారు.