కోటగిరి : గృహ అవసరాలు, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సమస్య ( Power problem) ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నిజామాబాద్ జిల్లా ఎన్డీసీపీఎల్ టెక్నికల్ డివిజనల్ ఇంజినీర్ రమేష్ (DE Ramesh) కోరారు. శుక్రవారం కోటగిరి (Kotagiri Mandal) మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల పరిష్కారం కోసమే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ లో ఎలాంటి సేవా లోపం ఉన్న ఫోరానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. విద్యుత్ బిల్లులు (Electricity Bills) అధికంగా వచ్చినా, కరెంటు మోటరు ట్రాన్స్ పార్మర్ సమస్య ఉన్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి పైన సోలార్ ఏర్పాటు చేసుకుంటే వీటికి సైతం సబ్సిడీ ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీల గురించి విద్యుత్ సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీ నగేష్, కోటగిరి ఏఈ బుచ్చిబాబు, లైన్ మెన్ వైద్యనాథ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.