
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 27: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలను లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, జీహెచ్ఎంసీ కోచ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో భాగంగా 55, 60, 70, 75, 80, 90 కేజీల విభాగాలలో వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి పోటీలు యువతలో స్ఫూర్తిని నింపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అధికారి శ్రీనివాస్‌గౌడ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌గౌడ్, ప్రవీణ్లాల్, పరశురాం, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. 55 కిలోల విభాగంలో చిరంజీవి, 60 కిలోల విభాగంలో జావేద్, 65 కిలోల విభాగంలో ఆకాశ్, 70 కిలోల విభాగంలో షోయబ్, 75 కిలోల విభాగంలో అఖిలేష్, 80 కిలోల విభాగంలో నితిన్‌కుమార్‌రెడ్డి, 85 కిలోల విభాగంలో శివ, 90 కిలోల విభాగంలో మోహన్‌లు విజేతలుగా నిలిచారు. విజేతలలో నుంచి నితిన్కుమార్రెడ్డిని చాంపియన్ ఆఫ్ చాంపియన్ 2022గా ఎంపిక చేశారు.