హనుమకొండ చౌరస్తా : రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల పిల్లలకు, అర్చకుల పిల్లలకు కారుణ్యనియామకాలు (Compassionate appointments) చేపట్టాలని అర్చక ,ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ ( Upendhar Sharma ) కోరారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రాలు అందించినట్లు పేర్కొన్నారు.
దేవాలయాల్లో పాచిక, పరిచారక, అర్చక పోస్టులను వేదపండితుల ద్వారా పరీక్షలు నిర్వర్తించి నియామకాలు చేపడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖర్ శర్మ, వరంగల్ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ పాతర్లపాటి నరేష్ శర్మ, ఉద్యోగుల సంఘం కన్వీనర్ కాండూరి కృష్ణమాచారి, ప్రచార కార్యదర్శి రిప్పుంజయ్ శర్మ, రిటైర్డ్ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గంగు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.