తుంగతుర్తి, జూన్ 10 : ఈనెల 12న తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో సారాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు. మొత్తం 9 వాహనాల్లో 6 ద్విచక్ర వాహనాలు, 2 టీవీఎస్ ఎక్సెల్, ఒక ఆటోకు వేలం జరుగుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు నిర్ణీత ధరలో సగం ఈఎండీ రుసుము చెల్లించాలని సూచించారు. ఆసక్తిగలవారు 9:00 గంటల లోపు ఎక్సైజ్ శాఖ కార్యాలయంకు రావాలని కోరారు.