Unemployees Strike | రాష్ట్రంలో త్వరలో 5000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడంతోపాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల తర్వాత మొక్కుబడిగా నోటిఫికేషన్లను విడుదల చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
పోలీస్ ఉద్యోగాలను 5000 నుండి 20000కు పెంచాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. దిల్ సుఖ్ నగర్ మెట్రో వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా కేవలం 5,000 పోస్టుల పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటనపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా కనీసం 15,000 పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ నిరుద్యోగులు ఎక్కువ ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ పోస్టులకు ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ెస్ ప్రభుత్వ హయాంలో 10 ఏండ్లలో మూడేళ్లకొకటి చొప్పున 50,000 పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశారు.
పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5000 నుండి 20000కు పెంచాలని దిల్సుఖ్నగర్ మెట్రో వద్ద నిరుద్యోగుల ధర్నా
ధర్నా చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు https://t.co/oLqys9tp4R pic.twitter.com/magVOG0JAB
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral