తిరుమల : తిరుమల( Tirumala ) వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 61,632 మంది భక్తులు దర్శించుకోగా 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.28 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.