ఆర్ఆర్ఆర్ పరిసరాల్లో వాణిజ్య మొక్కలు
- ఆర్థిక వనరుల పెంపుపై ఫారెస్ట్ కార్పొరేషన్ దృష్టి
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వనరులను పెంచుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడంపై తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) దృష్టి సారించింది. రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు, కార్పొరేషన్ ఆదాయ వనరులను విస్తరించుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) పరిసరాల్లో తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఉన్న 7.5 వేల ఎకరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ భూముల్లో ఉన్న నీలగిరి మొక్కల స్థానంలో వాణిజ్య, ఔషధ, పండ్ల మొక్కలతోపాటు కాలుష్యాన్ని నివారించే మొక్కలను నాటుతున్నది. ప్రత్యేకించి ఎర్రచందనం, రోజ్‌వుడ్, టేకు, శ్రీగంధం, సీతాఫలం, కరివేపాకు, సరుగు, వెదురు మొక్కలను నాటుతున్నది. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆరేండ్లలోగా మిగిలిన భూముల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. వీటిలో 10 శాతం ఎర్రచందనం, 30 శాతం వెదురు, 10 శాతం రోజ్‌వుడ్, 20 శాతం కరివేపాకు, సీతాఫలం తదితర మొక్కలను నాటనున్నట్టు ఫారెస్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bamboo
- cassava
- curry
- custard apple
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

