సహోద్యోగి కుటుంబానికి ఆపన్నహస్తం

రూ.ఐదు లక్షల ఆర్థికసాయం అందజేత
భీమదేవరపల్లి, అక్టోబర్ 17: సహోద్యోగి మృతితో తీవ్రంగా కలత చెందిన బ్యాచ్‌మేట్స్.. బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. రూ.5 లక్షల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల కిరణ్‌కుమార్ ఏఆర్ కానిస్టేబుల్‌గా కరీంనగర్లో విధులు నిర్వర్తించేవారు. అతను గత ఆగస్టు 2న రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలులో అతనితోపాటు ట్రైనింగ్ చేసిన 2009 బ్యాచ్ రెండో బెటాలియన్ మిత్రులు, కరీంనగర్, కృష్ణా, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల మిత్రుల నుంచి రూ.3.50 లక్షలు, సివిల్ బ్యాచ్ నుంచి రూ.1.57 లక్షలు సేకరించారు. మొత్తం రూ.5.07 లక్షల నుంచి కిరణ్‌కుమార్ పిల్లలు సంయుక్త, యషిత పేర్లమీద సుకన్య సమృద్ధి యోజన పథకం కింద రూ.3 లక్షలు, కుమారుడు పిట్టల అయ్యాన్ సాయి పేరిట రూ. 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన బాండ్ల ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చేతుల మీదుగా ఆదివారం సీపీ కార్యాలయంలో కిరణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- colleagues
- Help
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

