హైదరాబాద్, డిసెంబర్ 15: రియల్టీ సంస్థ ప్రిస్టేజ్ గ్రూప్‌తో కో-వర్కింగ్ ఆపరేటింగ్ సంస్థ అఫిస్.. హైదరాబాద్‌తోసహా దేశంలోని ఆరు నగరాల్లో కో-వర్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపాదిత ఆరు సెంటర్లను రూ.70 కోట్ల పెట్టుబడితో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్నట్లు అఫిస్ సీఈవో అమిత్ చెప్పారు.
ప్రిస్టేజ్ గ్రూప్‌తో తమ భాగస్వామ్యంలో తొలి దశలో ఆరు సెంటర్లను రూ.40 కోట్ల పెట్టుబడితో 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు ప్రారంభించామని, ఇప్పుడు రెండోదశ విస్తరణను చేపట్టామన్నారు. రెండు దశల్లోనూ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెల్లో ప్రిస్టేజ్ గ్రూప్ సొంత కమర్షియల్ ప్రాపర్టీల్లో సెంటర్లు ఏర్పాటవుతాయి. రెండు భాగస్వామ్య సంస్థలూ సమాన నిష్పత్తిలో పెట్టుబడులు చేస్తాయి.