ఊట్కూర : నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి( MLA Vakiti Srihari) అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పగిడిమర్రి గ్రామానికి చెందిన ఆశాభీ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ( CMRF ) నుంచి మంజూరైన రూ. 5 లక్షల ఎల్ఓసీని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద జబ్బుల బారిన పడి కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన తన దృష్టికి తేవాలని, ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఓబులాపూర్ మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ యూత్ నాయకులు రవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.