హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : జూన్ 15 నాటికి గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకా లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ షూట్లు, బెడ్ షీట్లు, సూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, యూనిఫామ్ అన్నీ నాణ్యమైనవే ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సంక్షేమ శాఖల గురుకులాల్లో పలురకాల సామగ్రి కొనుగోలుపై గురువారం సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ సామగ్రి కోసం వెంటనే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తిచేస్తామని తెలిపారు. అన్నిశాఖల గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని, సరఫరా కోసం మండల స్థాయిలో ఒక నోడల్ అధికారి చొప్పున నియమించాలని సూచించారు.