హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పిల్లలులేని వితంతు విదేశీ మహిళకు వీసా పొడిగింపునకు అనుమతించరాదన్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పక్కనపెట్టాలని హైకోర్టు మానవీయ కో ణంలో తీర్పు చెప్పింది.
భర్త కర్మకాండ లు నిర్వహించడంతోపాటు వృద్ధురాలైన అత్తకు తోడుగా ఉండటానికి వీలుగా వీసా పొడిగింపునకు చేసుకున్న దరఖాస్తును ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రష్యన్ మహి ళ అలెనా ఎవజెనియేవ్నా పావ్లోవా, అత్త వీ నళినీమాధవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమాపాక విచారణ చేపట్టి వీసాను పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.