మిర్యాలగూడ రూరల్, మార్చి 4 : గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఉపాధిహామీ నిధులు రూ.15లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అధిక నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్‌భగీరథ పథకంతో తాగునీరు అందించడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు పల్లెకే అందాన్ని తెచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టిబాబునాయక్, టీఆర్ఎస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు మట్టపల్లి సైదయ్యయాదవ్, గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ బారెడ్డి అశోక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జగదీశ్, టీఆర్ఎస్ నాయకులు చలికలంటి యాదగిరి, చింతల వెంకటేశ్వర్లు, బచ్చలకూరి శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పట్టణానికి చెందిన ఇస్మాయల్కు రూ.60 వేలు, వెంకట్‌రెడ్డికి రూ. 55 వేలు, హచ్చికి రూ.30 వేలు నవీన్‌కు రూ.60 వేలు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నవాబ్, పశ్య శ్రీనివాస్‌రెడ్డి, సైదులు, లక్ష్మీనారాయణ, రవినాయక్ ఉన్నారు.