ఎల్బీనగర్, జనవరి 20: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో జఠిలమైన సమస్యలను పరిష్కరించుకున్నామని, అందులో ప్రధానమైనవిగా అసైన్డ్, రిజిస్ట్రేషన్ స్థలాల సమస్యలున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అసైన్డ్, రిజిస్ట్రేషన్ సమస్యలున్న స్థలాలకు పరిష్కారం లభించిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అసైన్డ్, రిజిస్ట్రేషన్ సమస్యలున్న ఆయా కాలనీల వాసులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో గురువారం సమావేశం నిర్వహించారు.
ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజల గుండె చప్పుడు విని వెంటనే స్పందంచే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మన నగరం కార్యక్రమంలో ఈ సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు ముందుగానే అవగాహన ఉందని, ఎమ్మెల్యేగా తాను ఈ సమస్యలను ప్రస్తావించగానే అర్థం చేసుకుని ముందుకు తీసుకుని వెళ్లారన్నారు. గత ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను తాను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడే పరిష్కరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగానని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన మనోబలంతోనే సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నానని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, నల్ల రఘుమారెడ్డి, రమావత్ శ్రీనివాస్ నాయక్, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు కె.అరవింద్‌రెడ్డి, తూర్పాటి చిరంజీవి, సత్యంచారి, మల్లారెడ్డి, ముడుపు రాజిరెడ్డి, అనిల్, జగదీష్ యాదవ్, నాగరాజు, మల్లేష్, సింగిరెడ్డి మల్లిశ్వరి రెడ్డి, డేరంగుల కృష్ణ, శ్రీనివాస్‌యాదవ్, శరత్‌రెడ్డి, అంజిరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.