హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రో సెంటర్‌ను ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారా హిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు సిటీ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. చరిత్రాత్మక రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతోందని, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని, దీని ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆయన తన మెమోలో తెలిపారు.
పోలీసు శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒకే వేదికగా పని చేయనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పాపులర్‌గా పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇన్స్టాల్ చేసిన సుమారు 9.25 లక్షల కెమెరాలను ఈ సెంటర్లో మానిటర్ చేయనున్నారు.