ఖిల్లాఘనపురం, జూలై 8 : అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి పనులు ప్రారంభించినా బిల్లు రాకపోవడంతో మనస్తాపంతో లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలం వెంకటాంపల్లికి చెందిన చంద్రయ్య, అంజలమ్మకు నలుగురు కొడుకులు.
ఇద్దరికి వివాహం జరుగగా.. మరో ఇద్దరు శివశంకర్, సిద్ధిరాములు (28) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రాముకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా అప్పు తెచ్చి పనులు మొదలుపెట్టాడు. పనులు స్లాబ్ లెవల్‌కు చేరినప్పటికీ మొదటి బిల్లు కూడా రాలేదు. తనకున్న రెండెకరాల్లో వరి సాగుకు కొంత అప్పు చేయగా.. మొత్తం రూ.10 లక్షల వరకు అయ్యింది. అప్పు తీర్చేమార్గంలేక తీవ్రంగా కలతచెందిన రాములు గ్రామ సమీపంలోని రెడ్డిచెరువు గుట్టపై చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు.