
కుత్బుల్లాపూర్, జనవరి 26 : పోరాటాల ఫలితంగా సాధించుకు న్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన భవిష్యత్తరాలకు ఆదర్శనీయమని టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ శ్రీనివాస్, సత్తిరెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, పార్టీ నేతలు కిశోర్ చారీ, నజీర్ పాల్గొన్నారు.