కొండ లక్ష్మణ్ బాపూజీని స్మరించుకున్న సీఎం కేసీఆర్
కొండ లక్ష్మణ్ బాపూజీని స్మరించుకున్న సీఎం కేసీఆర్ | బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా బాపూజీని స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో న్యాయవాదిగా సేవలందించి, ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అన్నారు. మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారన్నారు.
ఆ విలువలను జీవితాంతం పాటిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆ స్ఫూర్తిని పంచారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని పేర్కొన్నారు. బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యానవన యూనివర్సిటీకి లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకుంటున్నట్లు గుర్తు చేశారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వినూత్న పథకాలు అమలు చేస్తూ చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vote for Note | ‘ఓటుకు నోటు’ కేసు.. విచారణ దీపావళి తర్వాతే వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
RTC Elections | ఆర్టీసీ కార్మికలోకం కుతకుత.. గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
Parental Controls | పిల్లల వాట్సప్ వాడకంపై తల్లిదండ్రులకే కంట్రోల్..కొత్త ఫీచర్లతో మెటా కీలక నిర్ణయం!
Birth Control Pill | మహిళలకే కాదు.. పురుషులకూ గర్భనిరోధక మాత్ర?.. అరగంట ముందు వేసుకుంటే చాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

