ఐడీటీఆర్కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం- వీడియో
ఐడీటీఆర్కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం | ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకొని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్కుమార్తో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం భవనంలో తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 20 ఎకరాల్లో రూ.20కోట్లతో ఐడీటీఆర్‌ను ఏర్పాటు చేయించారు. భవన నిర్మాణాలు పూర్తి కాగా, తేలిక పాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు నడిపేలా అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. డ్రైవర్‌కు శిక్షణతో పాటు రీఫ్రెషింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఆధునిక తరగతి గదులు, ఆఫీసర్ గదులు, వర్క్‌షాపులు, రోడ్లు, జీబ్రా క్రాసింగ్‌లు, క్యాంటిన్లు నిర్మించారు. ప్రభుత్వం, అశోక్ లేలాండ్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించే కళాశాలలో ఏటా రెండువేల మందికి డ్రైవింగ్‌లో నెలకు 400 మంది వరకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఐటీడీఆర్ దక్షిణ భారతదేశంలో నాలుగోదిగా.. తెలంగాణ రాష్ట్రంలో తొలి కేంద్రం. అన్ని జిల్లాలకు చెందిన వారు ఇక్క డ శిక్షణ పొందవచ్చు. శిక్షణ పొందిన వారికి పెద్ద పెద్ద కంపెనీలో హెవీ వెహికల్స్ నడిపే విధంగా డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇతర దేశాల్లో కూడా డ్రైవింగ్ కోసం ఉపాధికి వెళ్లేవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
విమానం కూలి ఆరుగురు మృతి
Good news : వారికి.. సింగిల్ డోసు టీకాతో ‘డెల్టా’ నుంచి రక్షణ
పశ్చిమ గోదావరి : కల్వర్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

