హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో జరిగిన టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నీలో హార్డ్‌కోర్ విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో హార్డ్‌కోర్ టీమ్ ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ స్టార్స్‌పై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ స్టార్ నిర్దేశించిన 62 పరుగుల లక్ష్య ఛేదనలో హార్డ్‌కోర్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. విజేతగా నిలిచిన హార్డ్‌కోర్ టీమ్‌కు ట్రోఫీతో పాటు లక్ష రూపాయలు, రన్నరప్ స్టార్ జట్టుకు రూ.50 వేలు అందజేశారు.
ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ ఆమిర్ ఆధ్వర్యంలో ఈనెల 5న మొదలైన ఈ క్రికెట్ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా జట్లు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లయిస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బెవరేజెస్ చైర్మన్ నగేశ్‌తో పాటు మహమ్మద్ ఆమిర్ తదితరులు పాల్గొన్నారు.