ప్రజలకు ఆషాఢ బోనాల శుభాకాంక్షలు
గోలొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గోలొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది.. తద్వారా తెలంగాణ సబ్బండ వర్ణాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం పేర్కొన్నారు. డప్పులు, మేళతాళాల నడుమ మహిళలు బోనమెత్తుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారని గుర్తుచేశారు.
తరతరాల తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్తిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందని చెప్పారు. బోనాల పండుగ ప్రారంభం రోజు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండటం శుభసూచకమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

