
జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తి రాష్ట్ర సాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వట్టికోట జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. పాత్రికేయుడిగా, కథకుడిగా, నవలాకారుడిగా తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారని, ఆయన సాహిత్య కృషి అజరామరం అని సీఎం పేర్కొన్నారు.