యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ..సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర చేపట్టారు.
హుస్నాబాద్ నుంచి మొదలై గత వారం రోజులుగా 246 కిలోమీటర్లు సాగిన ఈ సైకిల్ యాత్ర ఈ రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు చేరుకుంది.
సైకిల్ యాత్ర కి ఆలయ ఈవో, అర్చకులు పలువురు సంఘీభావం ప్రకటించారు. అనంతరం రాజు స్వామి వారికి తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలనే ఈ యాత్ర చేపట్టానని తెలిపారు.