తెలంగాణ ఉద్యమ రథసారథి.. కార్యసాధకుడు.. కారణజన్ముడు.. అపరభగీరథుడు.. రైతుబాంధవుడు.. జన హృదయనేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లెపల్లెనా పండుగ వాతావరణంలో సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించి, పటాకులు కాల్చారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై భారత్ నినాదాలతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కొత్తగూడెం రక్తదానం చేస్తున్న మహిళను పరీక్షిస్తున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు
ఖమ్మం, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కేక్‌లు కట్‌చేసి, స్వీట్లు పంచుకున్నారు. నగరంలోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ కేక్‌కట్ చేసి క్యాకర్తలకు స్వీట్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రం రవాణాశాఖ మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ పీ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కేఏఎంసీ చైర్పర్సన్ దోరెపల్లి శ్వేత, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు సీహెచ్ కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరై కేక్ కట్ చేశారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణ తదితరులు
అనంరతం పార్టీ అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి మేయర్ పీ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు హాజరయ్యారు. ఎన్సీపీ ఏరియాలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మధిర మున్సిపాలిటీ 8వ వార్డులో జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు హాజరై కేక్‌కట్ చేశారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు.
పార్టీ నాయకులతో కలిసి కేక్‌కట్ చేశారు. చింతకాని మండల కేంద్రంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరయ్యారు. వైరా పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. పలువురు పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, చంద్రావతి పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సంబురంగా జరిగాయి. ఈ వేడులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. దమ్మపేటలో వేడుకల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇల్లెందులో జరిగిన వేడుకలకు స్థానిక ఎమెల్యే హరిప్రియనాయక్ హాజరయ్యారు. పినపాక నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వీటితో మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో ప్రజలు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాలకు బీఆర్ఎస్ మండల బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.