CM KCR | కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ నేత గంప గోవర్దన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఆయనే చొరవ తీసుకున్నారని తెలిపారు. ‘ మీరు తప్పకుండా రావాలి.. ఇక్కడ నిలబడాలి. కామారెడ్డి మరింత అభివృద్ధి కావాలని.. ఆయన తన పదవిని త్యాగం చేసి మరీ నన్ను ఇక్కడకు తీసుకొచ్చి నిలబెట్టిండు’ అని చెప్పారు. ఈ సందర్భంగా గంప గోవర్దన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు.
గంప గోవర్దన్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తన మీద పడిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. గంప గోవర్దన్ రాజకీయ భవిష్యత్తును సేఫ్‌గా కాపాడుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పారు.